క్షేత్ర నిర్మాణ సంకల్పము
శ్రీ శైవ క్షేత్ర వైభవము
అఖిలాండ కోటి భ్రహ్మ్మాండాలలో విశిష్టమైన భూలోకంలో
ధర్మజ్యోతులను ప్రజ్వలింపచేయాలనే
శ్రీ శైవ క్షేత్ర నిర్మాణ సంకల్పం
శివమతధర్మస్ధాపన - శివతత్వ ప్రచారం - శివమందిరాల నిర్మాణం
యుగాలు మారినట్లు యుగధర్మాలు మారుతాయి. ఈ కలియుగంలో శివారాధనను మించినది మరొకటి లేదు. కుల, మత, జాతి, వర్గ, వర్ణ, లింగ, వయోభేధములు లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమతో కూడిన ఆనందమయ జీవితాన్ని పొందాలి. ఆనందమే శివుడు, ప్రతిఒక్కరు భగవంతునికి స్వయంగా సేవచేసుకొనే భాగ్యన్న్ని కలుగ చేయాలని సదుద్దేశ్యంతో శ్రీ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాద బలంతో ఇక్కడ దివ్యసిద్ద శ్రీ శైవక్షేత్రముని ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వ శాంతి కొరకు లోక కళ్యాణార్ధం శివ మత స్థాపన శివ తత్వ ప్రచారం తో, అఖిలాండ కోటి భ్రహ్మ్మాండాలలో విశిష్టమయిన భూలోకంలో ధర్మ జ్యోతులను ప్రజ్వలింప చేయాలనే అఖండ సంకల్పమే.... శ్రీ శైవ క్షేత్ర నిర్మాణ సంకల్పం.
--శుభం--
|